మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఎప్పుడూ మోటివేషనల్ వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తమకు దొరికిన ఆహారాన్ని పిల్లి వచ్చి తింటుండగా.. ఒక కాకి పిల్లిని తన ముక్కుతో గుచ్చగా ఆ కాకితో పిల్లి ఫైట్ చేస్తుండగా.. మరో కాకి వచ్చి ఆ ఆహారాన్ని తీసుకువెళ్లిపోతుంది. దీంతో కష్టాలు వచ్చిన సమయంలో ఎలా పోరాడాలో కాకులను చూసి నేర్చుకోవాలంటూ ఆనంద్ మహీంద్రా హితవు పలికారు.
మరోవైపు టీమ్ వర్క్‌కు సంబంధించి ఆనంద్ మహీంద్రా మరో వీడియో షేర్ చేశారు. సదరు వీడియోలో రేసింగ్ కారు ట్రాక్ మీద ఉండగానే కొంతమంది కార్మికులు వేగంగా వచ్చి టైర్లు మారుస్తుంటారు. ఇది టీమ్ వర్క్‌కు మంచి ఉదాహరణ అని.. స్లో మోషన్‌లో చూస్తే ఆ టీమ్ వర్క్ ఏంటో అర్థమవుతుందని ఆయన వివరించారు. ఏ పనిలో అయినా మంచి ఫలితాలు సాధించాలంటే టీమ్ వర్క్ చాలా ముఖ్యమని.. ఎవరి పని వాళ్లు చేయాల్సిన అవసరం ఉందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని ఆయన హితవు పలికారు.
