Site icon NTV Telugu

Expensive Taxi Ride: గంట టాక్సీ రైడ్ కోసం రూ. 30,000 బిల్లు.. షాకైన నటి..

Expensive Taxi Ride

Expensive Taxi Ride

Expensive Taxi Ride: స్విట్జర్లాండ్ పర్యటనలో అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, టీవీ హోస్ట్ గినా డార్లింగ్ ఊహించని షాక్‌ తగిలింది.. కేవలం గంటపాటు టాక్సీ ప్రయాణానికి ఆమెకు దాదాపు $338 అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ.30,500 బిల్లు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది… వీడియోలో ప్రయాణం కొనసాగుతుండగానే టాక్సీ మీటర్ మొత్తం 225.70 స్విస్ ఫ్రాంక్కు చేరిన దృశ్యాలు కనిపిస్తాయి. వెనుక సీటులో కూర్చున్న గినా.. ఆ మొత్తాన్ని చూసి ఆశ్చర్యంతో స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారిపోయింది..

Read Also: Kotha Malupu: సింగర్ సునీత కొడుకు రెండో సినిమా వచ్చేస్తోంది!

సాధారణంగా చాలా దేశాల్లో టాక్సీ ప్రయాణం అందుబాటులో ఉండే రవాణా మార్గంగా భావిస్తారు. అయితే, స్విట్జర్లాండ్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఈ ఘటన స్పష్టంచేసింది. అక్కడి అధిక వేతనాలు, జీవన వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల టాక్సీ ఛార్జీలు ఇతర దేశాల కంటే చాలా అధికంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ వీడియోకు గినా డార్లింగ్ ఇచ్చిన క్యాప్షన్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చివరికి బిల్లు $338 అయ్యింది. రైళ్లు, ఉబర్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ, చాలా బరువున్న లగేజీ ఉండడంతో తొందరపడి టాక్సీ తీసుకోవాల్సి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేసింది.. అయితే, ఇక్కడ కుళాయి నీరు మాత్రం అద్భుతంగా ఉంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ వీడియో ఇప్పటికే 4.4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్‌లో జీవన వ్యయం ఎంత ఎక్కువగా ఉంటుందో వివరిస్తూ పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక నెటిజన్, అమెరికా వెలుపల గంటసేపు క్యాబ్ ప్రయాణం చాలా అరుదు. యూరప్‌లో రైళ్లే బెస్ట్, అవి అయితే చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి అని వ్యాఖ్యానించగా, మరో వ్యక్తి జ్యూరిచ్‌లో ఓ బార్‌లో ఒక్క కాక్‌టెయిల్‌కే $22 చెల్లించాల్సి వచ్చింది అంటూ స్పందించారు. ఇంకొకరు, స్విట్జర్లాండ్‌లో ధర అడగకుండా ఏ వస్తువూ కొనొద్దు అని హెచ్చరించగా, భారతదేశానికి చెందిన ఓ యూజర్ ఇక్కడ గంటన్నర క్యాబ్ ప్రయాణానికి గరిష్టంగా $12–13 మాత్రమే ఖర్చవుతుంది. అక్కడ క్యాబ్‌కు $300 అంటే నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు.

Exit mobile version