NTV Telugu Site icon

అది ఏలియన్ కాదు, దెయ్యం అంతకంటే కాదు.. బూడిద పూసుకున్న మహిళ

గతవారం రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గ్రహాంతర వాసి భూమి మీద దిగిందంటూ ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. జార్ఖండ్‌లోని హ‌జారిబాగ్‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ్రామస్తులు సైతం దెయ్యం అంటూ పుకార్లు కూడా లేపారు. ఆ వీడియో కూడా నిజంగా జ‌రిగిన‌ట్టు ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ఉండ‌డంతో చూసిన వారంతా నిజంగానే ఎదో వింత జరుగుతుందని భావించారు. అయితే ఈ ఘటనని ఓ న్యూస్ రిపోర్టర్ ఛేదించాడు. ఆ వీడియో తీసిన వ్యక్తులను సంప్రదించగా.. ఆమె గ్ర‌హాంత‌ర వాసి కాద‌ని, హ‌జారిబాగ్‌లా అలా న‌గ్నంగా బూడిద పోసుకుని తిర‌గ‌డం చాలా కామ‌న్ అని, రాత్రి పూట న‌గ్నంగా మారి బూడిద పూసుకుని పూజ‌లు చేయ‌డం ఇక్క‌డ సాధారణమని తెలిపాడు. మతిస్థిమితం లేని ఓ మహిళ బూడిద పోసుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు.