Site icon NTV Telugu

Viral Video: మారణాయుధాలు, బండబూతులతో రెచ్చిపోయిన యువకుడు.. నెట్టింట వీడియో వైరల్!

Viral

Viral

Viral Video: పట్టపగలే ఓ యువకుడు రెచ్చిపోయిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం మత్తులో మారణాయుధాన్ని వెంటేసుకుని రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువకుడు చేతిలో కొడవలి లాంటి ఆయుధంతో తిరుగుతున్న ఈ దృశ్యాలు స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అతడి ప్రవర్తనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకోగా, వారిని కూడా బూతులతో తిట్టుతూ, రెచ్చిపోయినట్లుగా కింది వీడియోలో కనిపిస్తుంది. అతనితో పాటు ఉన్న ఓ యువతిని కూడా అతడు అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, “చంపేస్తా” అంటూ బెదిరింపులకు దిగాడు.

Read Also: Prabhas: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది!

అయితే, పోలీసులు వెంటనే అతని దగ్గర ఉన్న వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని నెటిజన్స్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version