NTV Telugu Site icon

Elephant Eating Pani Puri : ఏనుగుకు పానీ పూరీ ఇంత ఇష్టమా? లొట్టలేసుకుంటూ ఎలా తింటుందో చూడండి (వీడియో)

Elephant Eating Pani Puri

Elephant Eating Pani Puri

స్ట్రీట్ ఫుడ్‌కి మన దేశ ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఫుడ్స్‌లో పానీ పూరికి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ పానీ పూరి తినడానికి మహిళలలైతే ఎగబడుతుంటారు. అయితే ఇప్పుడు మనుషుల్లో మాత్రమే కాదు.. జంతువులలో కూడా దీని ఆదరణ పెరుగుతోందని తెలుస్తోంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే..

READ MORE: Kumbhmela 2025 : కుంభమేళా 2025 కోసం 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా.. భారీ ప్లాన్ వేసిన రైల్వే

పానీ పూరీ బండి వద్దకు ఏనుగు వచ్చింది. అక్కడ వ్యాపారి ఏనుగుకు పానీ పూరీ అందిస్తున్నాడు. పూరీలో బఠానీ నింపి, నీటిలో ముంచి ఆ ఏనుగు తొండెంలో పెడుతున్నాడు. ఆ గజరాజు ఎంతో ఆనందంగా లొట్టలేసుకుంటూ తింటోంది. ఏనుగు ఇలా చేయడం చూసిన స్థానికులు బండి వద్ద గుమిగూడారు. బండి యజమానికే పానీ పూరి అందిస్తూ.. అలసట వస్తుందే కానీ.. ఆ గజరాజు మాత్రం తినడం ఆపలేదు. ఒకదాని తర్వాత ఒకటి తింటునే ఉంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే వీడియోలో ఏనుగుపై ఓ వ్యక్తి కూర్చున్నట్లు కూడా కనిపిస్తున్నాడు.

READ MORE: Fengal Cyclone: తెలంగాణకు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు జిల్లాలకు వర్ష సూచన

చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. కేవలం ఒక్క రోజులో ఈ వీడియోకు 75 వేలకు పైగా లైక్‌లు, వన్ మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి. ఓ వ్యక్తి.. “గజరాజుకి కోపం వస్తే బండి మొత్తం తినేస్తాడు.” అని కామెంట్ చేశాడు. “ఇది ఆడ ఏనుగు అయి ఉంటుంది. అందుకే పానీ పూరీ ఎంతో ఇష్టంగా తింటోంది.” అని వాఖ్యానించాడు.

Show comments