NTV Telugu Site icon

రైలు ప‌ట్టాల‌పై కూలిన విమానం… ఎదురుగా దూసుకొచ్చిన రైలు…ఆ త‌రువాత‌…

భూమిమీద నూక‌లు ఉంటే మ‌ర‌ణం చివ‌రి అంచుల‌దాక వెళ్లినా తిరిగి వెన‌క్కి రావొచ్చు. నిండు నూరేళ్లు జీవించ‌వ‌చ్చు.  అదే కాలం చెల్లితే రోడ్డుపై వెళ్తున్న స‌మ‌యంలో తెలియ‌కుండానే మెరుపుదాడికి బ‌లికావొచ్చు.  జీవితంలో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో చెప్ప‌లేం.  బ‌తికినంత కాలం అల‌ర్ట్‌గా ఉండాలి.  ఎప్పుడు ఏ ప్ర‌మాదం ముంచుకొచ్చినా సిద్ధంగా ఉండాలి.  తృతిలో త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. విమానం కూలిపోతే అందులో ఉన్న మ‌నుషులు బ‌తికి బ‌ట్ట‌గ‌ట్ట‌డం చాలా క‌ష్టం.  అదే విమానం రోడ్డుపై కూలిపోయి, అందులో ఉన్న వ్య‌క్తి ఊపిరితో ఉండి, ఎదురుగా మ‌రోప్ర‌మాదం దూసుకొస్తే, ఆ ప్ర‌మాదం నుంచి కూడా త‌ప్పించుకుంటే అత‌నిని ఏమ‌నాలి… భూమిపై ఇంకా అత‌నికి జీవించే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకోవాలి.  లాస్ ఎంజెల్స్‌లోని ఓ రైల్‌రోడ్ మీద విమానం కూలిపోయింది.  

Read: థ‌ర్డ్ వేవ్‌పై ఢిల్లీ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు… ఒక‌టి రెండు రోజుల్లోనే…

అందులో ఉన్న పైల‌ట్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అదే స‌మ‌యంలో ఆ ట్రాక్ మీద రైలు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం ఇచ్చారు.  అక్క‌డే ఉన్న పోలీసులు వెంట‌నే స్పందించి విమానంలో గాయాల‌తో ప‌డిఉన్న పైల‌ట్ ను బ‌య‌ట‌కు తీసీ రోడ్డుమీద‌కు లాక్కోని వ‌చ్చారు.  అలా బ‌య‌ట‌కు తీసుకొచ్చిన క్ష‌ణాల వ్య‌వ‌ధిలో రైలు దూసుకొచ్చి విమానాన్ని ఢీకొట్టింది. రైలు ఢీకొన‌డంతో ఆ చిన్న విమానం తునాతున‌క‌లైంది.  స్థానిక ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ ఏజెన్సీ స‌మాచారం ప్ర‌కారం సెప్నా 72 విమానం ఫెర్నాండో వెల్లి క‌మ్యూనిటీ నుంచి టెకాఫ్ అయ్యింది.  టెకాఫ్ అయిన కొద్ది సేప‌టికే విమానం రైల్ రోడ్‌పై కూలిపోయింది.