థ‌ర్డ్ వేవ్‌పై ఢిల్లీ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు… ఒక‌టి రెండు రోజుల్లోనే…

ఢిల్లీలో కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  రోజువారీ కేసులు 20 వేల వ‌ర‌కు న‌మోద‌వుతున్నాయి.  వారం రోజుల వ్య‌వ‌ధిలో 1000 నుంచి 20 వేల‌కు పెరిగాయి.  ఈ స్థాయిలో కేసులు పెర‌గ‌డంతో ఢిల్లీ స‌ర్కార్ నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ క‌ర్ఫ్యూల‌ను అమ‌లు చేస్తున్న‌ది. అయితే, ఆదివారం రోజున 22 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ్వ‌గా, సోమ‌వారం రోజున 19 వేల కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి.  సుమారు మూడు వేల వ‌ర‌కు కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంపై ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేందర్ జైన్ స్పందించారు.  దేశంలో థ‌ర్డ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతోందని, అయితే ఢిల్లీలో ఒక‌టి రెండు రోజుల్లో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కు వెళ్లే అక‌వాశం ఉంద‌ని, సోమ‌వారం రోజున కేసులు త‌గ్గడ‌మే ఇందుకు ఒక ఉదాహ‌ర‌ణ అని చెప్పారు.  థ‌ర్డ్ వేవ్ పీక్స్ కు చేరుకున్న త‌రువాత కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తాయ‌ని అన్నారు.  అయితే, కొంత‌మంది నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ కార‌ణంగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డాన్ని నియంత్రించ‌డంతో కేసుల సంఖ్య త‌గ్గిందని నిపుణులు చెబుతున్నారు. వీకెండ్ క‌ర్ఫ్యూ వ‌ల‌న ఉప‌యోగాలు క‌నిపిస్తున్నాయ‌ని నిపుణులు పేర్కొన్నారు.  

Read: క‌రోనా క‌ల‌క‌లం: మొన్న పార్ల‌మెంట్‌, నిన్న సుప్రీంకోర్ట్‌… నేడు తీహార్ జైల్‌…

Related Articles

Latest Articles