భారతీయ రైళ్లలో విక్రేతలు తిరుగుతూ.. ప్రయాణికులకు టీ అమ్మడం చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఇండిగో విమానంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి విమానంలో తిరిగి ప్రయాణికులకు డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ అందిస్తున్నాడు. అంతే కాకుండా రైళ్లో మాదిరిగానే “చాయ్.. చాయ్..” అంటూ అరుస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని పలువురు అంటున్నారు. థాయ్‌లాండ్ వెళ్లే విమానంలో ఈ వింత ఉదంతం జరిగింది. తాజాగా దీనిపై విమానయాన సంస్థ క్లారిటీ ఇచ్చింది. కొందరు నెటిజన్లు “ఇది రైలు కాదు.. విమానం” అని కామెంట్ చేశారు.
తమకు చెందిన విమానంలోనే ఈ ఘటన జరిగిన విషయం వాస్తవమేనని ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఓ ప్రయాణికుడు ఇతర ప్రయాణీకులకు ఫ్లాస్క్ లో తెచ్చున్న టీ అందించాడని తెలిపింది. సిబ్బంది అతన్ని చూడగానే.. కూర్చోమని చెప్పినట్లు పేర్కొంది. ఎందుకంటే, ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయం వచ్చిందని చెప్పింది. ఈ ఘటన గగనతలంలో జరగలేదని.. ఆ సమయంలో విమానం టేకాఫ్ కాలేదని విమానయాన సంస్థ చెప్పింది. ఓ ప్రయాణికుడు విమానంలో రీల్ చేశాడని.. ఈ అంశంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ క్లారిటీ ఇచ్చింది. అయితే.. విమానంలో టీ అందించిన ప్రయాణికుడు ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించినట్లు సంస్థ తెలపలేదు.
Three strolling down the aisle of an @IndiGo6E airplane, casually serving tea in disposable cups and one guy for filming the act at 36000 ft pic.twitter.com/dEWWKYtoRk
— J (@fnkey) December 24, 2024