Site icon NTV Telugu

Chhattisgarh: ఇద్దరు తల్లులతో ఒకే వేదికపై పెళ్లి.. కథలో ట్విస్టులే ట్విస్టులు

Man Married Two Women

Man Married Two Women

అఫ్‌కోర్స్.. ఆల్రెడీ పెళ్లయి, పిల్లలున్న వాళ్లు మళ్ళీ పెళ్లి చేసుకున్న సందర్భాల్ని మనం ఎన్నో చూశాం. కానీ, ఈ పెళ్లి మాత్రం అలా కాదు. ఇందులో మీకు ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఒకే వేదికపై ఇద్దరు తల్లుల్ని ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఆ పిల్లల తండ్రి ఎవరనుకుంటున్నారు? ఆ వరుడే! ఇద్దరు యువతుల్ని ప్రేమించిన అతగాడు.. వారితో పిల్లల్ని కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన ఛత్తీస్​గఢ్​, బస్తర్​ జిల్లాలో జరిగింది.

కేశ్​కాల్​ ప్రాంతంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్​ సింగ్ సలామ్‌కి తొలుత ఆండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్​ అనే యువతితో నిశ్చితార్థం అయింది. అప్పట్నుంచి ఆమె రంజన్ సింగ్ ఇంట్లోనే ఉంటూ వచ్చింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కట్ చేస్తే.. దుర్గేశ్వరీ తన ఇంట్లో ఉండగానే అంవరీ గ్రామానికి చెందిన సన్నో బాయి అనే మరో యువతిని రంజన్ సింగ్ చాటుగా ప్రేమవ్యవహారం కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఆమె కూడా గర్భం దాల్చింది. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో, పెద్ద దుమారమే రేగింది. గ్రామంలో పంచాయతీ సైతం నిర్వహించారు. చివరికి.. ఆ ఇద్దరిని రంజన్ సింగ్ పెళ్లి చేసుకోవడమే సరైన పరిష్కారమని గ్రామ పెద్దలు నిర్ణయించారు.

ఆ ఇద్దరు యువతుల్ని రంజన్ సింగ్‌ను వివాహమాడాల్సిందిగా ఒప్పించారు. తొలుత వాళ్లు ఒప్పుకోకపోయినా, అనంతరం అంగీకరించారు. పెద్దలు కూడా సరేనని చెప్పడంతో.. ఒకే వేదికపై ఈనెల 8న ఆ ఇద్దరిని రంజన్ సింగ్ వివాహం చేసుకున్నాడు​. ఇలాంటి పెళ్లి తొలిసారి జరగడంతో.. ఈ వివాహ తంతును చూసేందుకు ఉమ్లా గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు సైతం తరలివచ్చారు.

Exit mobile version