NTV Telugu Site icon

Viral Wedding Card: ఐడియా అదుర్స్ గురూ.. “ఆపిల్ మ్యాక్ బుక్ పెళ్లి పత్రిక”.. వీడియో వైరల్

010101

010101

త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ప్రజలు ఇప్పటికే దాని కోసం సన్నాహాలు ప్రారంభించారు. పెళ్లిలో వెడ్డింగ్ కార్డులను ముద్రించడం ముఖ్యమైన పని. ప్రజలు ముందుగానే కార్డ్ డిజైన్‌ని ఎంచుకుని, దాని మెటీరియల్‌ని సిద్ధం చేసి, ఆపై దానిని ప్రింట్ చేస్తారు. తర్వాత పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కార్డు డిజైన్ ఆకర్షణీయంగా ఉంటే అది ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఒక వ్యక్తి తన పెళ్లిలో వెడ్డింగ్ కార్డ్.. “యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో” లాగా తయారు చేయించాడు. అలాంటి కార్డును ఎవరూ మర్చిపోలేరు. అతను కార్డును పంపిణీ చేయడానికి బయటకు వెళ్లినప్పుడు.. ప్రజలు మొదట దానిని ల్యాప్‌టాప్ గా భావించారు. అయితే అది కార్డు అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏంటంటే..

READ MORE: Devara Latest Update: స్టేజ్ మీద బారికేడ్లు.. ఎన్టీఆర్ తో మాట్లాడించే యత్నం?

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ జంట తమ వివాహ ఆహ్వాన పత్రికలో అత్యంత వైవిధ్యాన్ని చూపించింది. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి ప్రాంతానికి చెందిన డీఎస్పీ మనోజ్ కుమార్ కు ఇటీవల వివాహం నిశ్చయమైంది.. వివాహ తేదీ రానే వచ్చింది. ఈ నేపథ్యంలో తన వివాహానికి బంధువులను ఆహ్వానిస్తూ ఒక పత్రికను ఆయన రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ఈ పత్రిక అత్యంత వినూత్నంగా ఉంది. పత్రికపై ఆపిల్ సింబల్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అది అచ్చం ఆపిల్ మ్యాక్ బుక్ లాగా దర్శనమిస్తోంది. దానిని తెరిచి చూస్తే గూగుల్ స్క్రీన్ కనిపిస్తోంది. మరోవైపు కీబోర్డు తరహాలో ఓ చిత్రం ఉంది.. మనోజ్ తనకు కాబోయే భార్య చారునితో జరిగే పెళ్లికి సంబంధించిన విషయాన్ని గూగుల్ లో శోధించినట్టు చూపించారు.. దాని కింద ముహూర్త సమయం, కళ్యాణ వేదిక, ఆ వేదికను చూపించే గూగుల్ లొకేషన్.. ఇతర వివరాలు రూపొందించారు..

READ MORE:Pantham Nanaji: కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ

ఈ వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఖాతాలో పోస్ట్ చేయగా.. 68 లక్షలకు పైగా.. వీక్షించారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వెడ్డింగ్ కార్డ్ ధర ఎంత అని చాలా మంది అడిగారు. సోషల్ మీడియా వ్యాపారి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అదే జరుగుతుందని ఒకరు కామెంట్ చేశారు.