60 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు కేవలం రెండే రోజుల్లో బైక్ నేర్చుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా 60 ఏళ్లు వచ్చాయంటే కేవలం ఇంటికే పరిమితమవుతారు. కానీ ఇక్కడ ఓ బామ్మ మాత్రం యవతతో కలిసి బైక్ నేర్చుకుని అందరిని ఔరా అనిపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని కేఫే క్రూయిజర్స్ మోటార్‌సైకిల్ అకాడమీలో పలువురు యువతీ–యువకులు బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. అదే అకాడమీలో ఈ 60 ఏళ్ల బామ్మ లతా శ్రీనివాసన్ కూడా చేరి వారితో సమానంగా శిక్షణ ప్రారంభించారు. మొదటి రోజే క్లచ్, బ్రేక్, గేర్ మార్పు వంటి ప్రాథమిక విషయాలన్నీ నేర్చుకున్నారు. రెండో రోజుకే సెకండ్, థర్డ్ గేర్‌లలో బైక్‌ను స్మూత్‌గా నడిపి ట్రైనర్లను ఆశ్చర్యపరిచారు.
వడవల్లికి చెందిన లతా శ్రీనివాసన్ గతంలో కార్పొరేట్ మేనేజర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచే బైక్ రైడ్ చేయాలన్న కోరిక ఉన్నా, దాన్ని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అయితే ఆమెకు సైక్లింగ్‌పై మంచి అనుభవం ఉంది—ఒక్కరోజులో 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన రికార్డ్ కూడా ఉంది.వయసు 60 దాటినా, “ఇంకెందుకు ఆలస్యం?” అనుకుని, జీవితంలో మిగిలిన రోజుల్ని సైకిల్ కాదు, బైక్‌పై ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో మోటార్‌సైకిల్ అకాడమీలో చేరి సీరియస్‌గా నేర్చడం ప్రారంభించారు.
అదిరే వేగంతో నేర్చుకుంటూ, రకరకాల మోడల్ బైక్‌లను ట్రై చేసి, చివరికి తిరుగులేని రైడర్‌గా నిలిచారు. ఆమె దూకుడు చూసి ట్రైనర్లే “ఇంత త్వరగా నేర్చిందేంటి!” అని ఆశ్చర్యపోయారు.లతా శ్రీనివాసన్ చూపించిన పట్టుదల, జోష్, నేర్చుకోవాలనే తపన అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
