Site icon NTV Telugu

Shocking Makeover: మొన్న‌టి వ‌ర‌కు కూలి… నేడు కేర‌ళ రోల్ మోడ‌ల్‌…

మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌నో కూలి. చిన్న చిన్న ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. ముతక గ‌ళ్ల లుంగి, మాసిపోసిన గ‌డ్డం, త‌ల వెంట్రుక‌లు, చేతిలో ప్లాస్టిక్ క‌వ‌ర్ సంచీ. కూలికి పోతే త‌ప్పించి ఇళ్లు గ‌డ‌వ‌ని ప‌రిస్థితి. ఇలాంటి వ్య‌క్తి ఇప్పుడు కేర‌ళ‌లో రోల్ మోడ‌ల్ గా మారిపోయాడు. షాకింగ్ మేకోవ‌ర్‌తో ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. రోడ్డుపై కూలిప‌ని చేసుకునే కోజికోడ్ కు చెందిన మామిక్క అనే వ్య‌క్తి స్విస్ మేకోవ‌ర్‌తో షాకిచ్చాడు. గ‌తంలో మామిక్క లుంగీ, కోటు, క‌ళ్ల‌జోడు ధ‌రించిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.

Read: Chenab Bridge: కాశ్మీర్ వంతెన‌పై ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌… వైర‌ల్‌…

వాటిని చూసిన ష‌రీక్ వ‌యాలిల్ అనే ఫొటోగ్రాఫ‌ర్ అత‌ని మేకోవ‌ర్‌ను పూర్తిగా ఛేంజ్ చేశారు. స్టైలిష్ వెడ్డింగ్ సూట్, బ్రాండెడ్ షూష్‌, క‌ళ్ల‌కు స్టైలిష్ గాగూల్స్‌, చేతిలో ట్యాబ్‌తో చిన్న వీడియోను షూట్ చేశారు. ఆ వీడియోను చూసిన మామిక్క షాక్ అయ్యాడు. అస‌లు అందులో ఉన్న‌ది త‌నేనా అనుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతున్న‌ది. 60 సంవ‌త్స‌రాల వ‌య‌సులో జేమ్స్‌బాండ్‌లా ఉన్నాడ‌ని, హాలీవుడ్ సినిమాల్లో ఖ‌చ్చితంగా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Exit mobile version