Moon events 2026 : రాబోయే 2026 సంవత్సరం అంతరిక్ష పరిశీలకులకు ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. సాధారణంగా ఏడాదికి 12 పౌర్ణమిలు వస్తుంటాయి, కానీ 2026లో ఏకంగా 13 పౌర్ణమిలు (Full Moons) సంభవించబోతున్నాయి. ఇందులో ఒకే నెలలో రెండు పౌర్ణమిలు రావడం వల్ల ఏర్పడే ‘బ్లూ మూన్’ (Blue Moon) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మే నెలలో రెండు పౌర్ణమిలు రానుండటంతో, రెండో దానిని బ్లూ మూన్‌గా పరిగణిస్తారు. కేవలం పౌర్ణమిలే కాకుండా, చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే ‘సూపర్ మూన్’ (Supermoon)లు కూడా ఈ ఏడాది మూడు సార్లు దర్శనమివ్వబోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ , అక్టోబర్ నెలల్లో సంభవించే ఈ సూపర్ మూన్ల సమయంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఆకాశంలో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాడు.
Tirupati: పెళ్లాం కోసం అత్తింటికి వెళితే.. అల్లుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన మామ..
అంతేకాకుండా, 2026లో రెండు సంపూర్ణ చంద్ర గ్రహణాలు (Total Lunar Eclipses) ఏర్పడనుండటం విశేషం. మార్చి , సెప్టెంబర్ నెలల్లో సంభవించే ఈ గ్రహణాల సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి, ఎరుపు రంగులోకి మారుతూ ‘బ్లడ్ మూన్’ (Blood Moon) గా కనిపిస్తాడు. వీటికి తోడు ‘హార్వెస్ట్ మూన్’ (Harvest Moon), ‘హంటర్ మూన్’ (Hunter’s Moon) వంటి సీజనల్ పౌర్ణమిలు కూడా ఆయా నెలల్లో ప్రకృతికి కొత్త శోభను తీసుకురానున్నాయి. ఈ ఖగోళ అద్భుతాలన్నీ కేవలం శాస్త్రవేత్తలకే కాకుండా, ఫోటోగ్రాఫర్లకు , సామాన్య ప్రజలకు కూడా అరుదైన అనుభూతిని మిగల్చనున్నాయి. వాతావరణం సహకరించి, ఆకాశం నిర్మలంగా ఉంటే ఈ 13 ఘట్టాలు 2026 క్యాలెండర్‌లో అత్యంత సుందరమైన రోజులుగా నిలిచిపోతాయి.
New Year Midnight Kiss: న్యూ ఇయర్ మిడ్‌నైట్ కిస్.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే?
