Site icon NTV Telugu

Viral News: అతనికి 61.. ఆమెకి 18.. ఆయనే బెస్ట్ అంటూ కితాబు

Ashiya Married Rana Shamsha

Ashiya Married Rana Shamsha

ప్రేమ గుడ్డిదని అంటుంటారు. ప్రేమకు వయసు, ఆస్తులు, కులమతాలతో సంబంధం ఉండదని చెప్తుంటారు. కానీ, ఓ అమ్మాయి చేసిన పనికి మాత్రం ప్రేమ మూగది, చెవిటిది అని కూడా అనాల్సి వస్తోంది. కారణం.. ఆమె ఏకంగా తాత వయసున్న వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకోవడమే! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. 18 ఏళ్ల ఓ అమ్మాయి.. 61 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఇంకా ప్రేమలో పడకుండా సింగిల్‌గానే మిగిలున్న అబ్బాయిల గుండెల్ని పిండేసే ఈ ప్రేమ వ్యవహారం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

ఆ అమ్మాయి పేరు ఆషియా.. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు రానా శంషాద్. చాలా పేదరికంలో ఉన్నప్పటికీ, ఎలాంటి లోటు లేకుండా కూతుళ్ల పెళ్లి చేశాడు. పైగా, చాలా మంచివాడని రానా శంషాద్‌కి పేరుంది. ఈ విషయాలు వినే తనకు ఆయనపై ఆసక్తి కలిగిందని, రెండుసార్లు కలిసి తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆషియా తెలిపింది. పెళ్లి తర్వాత శంషాద్ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ఏది కావాలని కోరినా వెంటనే తెచ్చిస్తారని ఆషియా చెప్పింది. జంటల్ని దేవుడు నిర్ణయిస్తాడని, హృదయాలు మాత్రమే ఇక్కడ కలుస్తాయని హితవు పలుకుతోంది.

అయితే.. తమ వయస్సు వ్యత్యాసం కారణంగా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని శంషాద్ చెప్పారు. అంతెందుకు.. ఆషియాతో పెళ్లికి ఓకే చెప్పినప్పుడు తన బంధువులు నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం వాటిని పట్టించుకోలేదని, వయసు తేడా దృష్ట్యా ఇలాంటి అడ్డంకులు రావడం సాధారణమేనని అనుకున్నానన్నారు. ఇప్పటికీ తమ పెళ్లి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయన్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. అసలు తమ పెళ్లి ఎప్పుడు జరిగిందనేది శంషాద్, ఆషియాలు క్లారిటీ ఇవ్వలేదు.

Exit mobile version