Why You Need Advisors: ఏదైనా ఒక కంపెనీ షేర్లను కొని లాంగ్ టర్మ్ లాకర్‌లో పెట్టుకోవటం కరెక్టేనా అంటే ‘కాదు’ అని కొందరు స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకు చేయకూడదో వివరించేందుకు వాళ్లు కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. బిజినెస్‌లను మార్చుకోకపోవటం వల్ల గతంలో కొన్ని వందల కంపెనీలు వ్యాపార రంగం నుంచి ఫేడ్ ఔట్ కావాల్సి వచ్చిందని సూచించారు. ఈ నేపథ్యంలో తగబడుతున్న ఇంట్లో కళ్లు మూసుకొని కూర్చుంటే లాభంలేదని, కేర్‌ఫుల్‌గా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని వివేకం అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఇటీవల ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. పెట్టుబడులు ఏవిధంగా పెట్టాలి అనే విషయంలో మనకు అడ్వైజర్ల అవసరం ఏ మేరకు ఉంటుందో ఆ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీవీకే ప్రసాద్ వివరించారు. మరింత విలువైన సమాచారాన్ని ఆయన మాటల్లోనే వినాలంటే ఈ వీడియోను తప్పక చూడండి.