NTV Telugu Site icon

Vodafone Idea is Losing Customers: ప్రతి నెలా భారీగా తగ్గిపోతున్న ‘వీఐ’ కస్టమర్ల సంఖ్య

Vodafone Idea Is Losing Customers

Vodafone Idea Is Losing Customers

Vodafone Idea is Losing Customers: ‘వన్‌ ఐడియా కెన్‌ ఛేంజ్‌ యువర్‌ లైఫ్‌’ అంటూ ఆకట్టుకునే ప్రచారంతో దూసుకొచ్చిన టెలికం సంస్థ ఐడియా. ఈ కంపెనీ సిమ్‌ కార్డ్‌ తీసుకోవటం వల్ల మన జీవితాలు మారిపోవటం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఆ సంస్థ జీవితమే తిరోగమనంలో పయనిస్తోంది. వొడాఫోన్‌-ఐడియాకి ప్రతి నెలా లక్షల సంఖ్యలో కస్టమర్లు తగ్గిపోతున్నారు. లేటెస్ట్‌గా అక్టోబర్‌లో 35 లక్షల మంది గుడ్‌బై చెప్పేశారు.

ఈ రేంజ్‌లో వినియోగదారుల నుంచి తిరస్కారానికి గురవుతున్న మరో టెలికం కంపెనీ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ వివరాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా సోమవారం వెల్లడించింది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ నుంచి 5 లక్షల 19 వేల మంది వెళ్లిపోయారు. ఎంటీఎన్‌ఎల్‌కి 3 వేల 591 మంది టాటా చెప్పారు. దీనికి విరుద్ధంగా రిలయెన్స్‌ జియో మరియు ఎయిర్‌టెల్‌కి 22 లక్షల మందికి పైగా యాడ్‌ అయ్యారు.

read more: DHFL Loan Fraud Case: హెలీకాప్టర్‌ చెప్పిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దా‘రుణ’ మోసం కథ!

ఈ రెండు కంపెనీల్లో ప్రతి నెలా కొత్త వినియోగదారులు చేరుతుండటం గమనించాల్సిన విషయం. ఇదిలాఉండగా దేశంలోని టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య అక్టోబర్‌లో ఒకటీ పాయింట్‌ నాలుగు ఏడు మిలియన్లు పడిపోగా మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 18 లక్షలు తగ్గిపోయింది. సెప్టెంబర్‌ చివరి నాటికి టోటల్‌గా 114 పాయింట్‌ ఐదు నాలుగు కోట్ల మంది మొబైల్‌ కస్టమర్లు ఉన్నారు. అక్టోబర్‌ చివరి నాటికి మాత్రం 114 పాయింట్‌ మూడు ఆరు కోట్లకు మైనస్‌ అయ్యారు.