Site icon NTV Telugu

TIE Charter Member: వ్యాపారం చేయాలనే ఆలోచన, ఆసక్తి ఉంటే.. మేము మీ వెంటే: సుబ్బరాజు పేరిచర్ల

Cross Boarders

Cross Boarders

Cross Boarders: ‘వ్యాపారం చేయాలనే ఆలోచన, ఆసక్తి ఉంటే.. మేము మీ వెంటే’ అని క్రాస్‌ బోర్డర్స్‌ ఫౌండర్‌, ‘TIE’ చార్టర్ మెంబర్ సుబ్బరాజు పేరిచర్ల తెలిపారు. క్రాస్‌ బోర్డర్స్‌ అనేది ఎర్లీ స్టేజ్‌ స్టార్టప్‌ ఫౌండర్ల కోసం ఎకోసిస్టమ్‌ని రూపొందించే సంస్థ. TIE.. గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఆర్గనైజేషన్‌. లాభాపేక్షలేని సంస్థ. సుబ్బరాజు పేరిచర్ల.. SPA ఎంటర్‌ప్రైజెస్‌కి పార్ట్నర్‌గా, అడ్వైజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. SPA.. ఇదొక టెక్నాలజీ కంపెనీ. బ్రిటన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏడాది కిందట ఇండియాలోనూ సర్వీస్‌ మొదలుపెట్టింది. మిడ్‌ సైజ్‌ బిజినెస్‌ల కోసం సొల్యూషన్‌ బేస్డ్‌ అప్లికేషన్లను కోక్రియేట్‌ చేస్తోంది.

స్టార్టప్‌లకు ఎదురయ్యే అవాంతరాలను కార్పొరేట్‌ ఎక్స్‌లెన్స్‌తో అధిగమించటానికి, తద్వారా మిడ్‌ సైజ్‌ బిజినెస్‌లకు సొల్యూషన్స్‌ని కోక్రియేట్‌ చేయటానికి ఈ రెండు (క్రాస్‌ బోర్డర్స్‌ మరియు ఎస్‌పీఏ) కంపెనీలూ సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో రోబోటిక్‌ స్టార్టప్స్‌ మరియు నెట్‌వర్కింగ్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. అంతేకాదు. ఇండియాతోపాటు యూరప్‌లోని ట్రైనర్స్‌కి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ పోర్ట్‌ఫోలియో కంపెనీ ద్వారా పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయి. క్రాస్‌ బోర్డర్స్‌ కంపెనీ ప్రస్తుతం ‘నా పంట’ అనే అగ్రిటెక్‌ స్టార్టప్‌తో మరియు రూరల్‌ లాజిస్టిక్స్‌ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తోంది.

ఇదిలాఉండగా.. తాను గత దశాబ్ద కాలంగా ఎడ్యుకేషన్‌, ఫిన్‌టెక్‌, మీడియా టెక్‌, హెల్త్‌టెక్‌ వంటి స్టార్టప్‌లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నట్లు సుబ్బరాజు పేరిచర్ల తెలిపారు. ‘నా పంట అనే అగ్రిటెక్ స్టార్టప్ వ్యవస్థాకుడు ఒక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటుచేశారు. ఇందులో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 2,50,000 మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. ఈ సంస్థను నెక్‌స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లేందుకు అతనితో కలిసి పనిచేస్తున్నాం. తద్వారా మరింత రెవెన్యూని జనరేట్‌ చేయాలని ప్రయత్నిస్తున్నాం. అనంతపూర్‌కి చెందిన ఓ యువకుడు రూరల్‌ లాజిస్టిక్స్‌ కోసం లోకల్‌ ఎకోసిస్టమ్‌ని డెవలప్‌ చేస్తున్నాడు. అతనికి ఫండింగ్‌ చేస్తున్నాం.

అతను తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఉత్పత్తులను డెలివరీ చేయటానికి లోకల్‌ మార్కెట్‌ ప్లేస్‌ను ఏర్పాటుచేస్తున్నాడు. బిజినెస్‌ ఐడియా.. స్కూల్‌ లెవల్‌ విద్యా్ర్థికి వచ్చినా TIE మెంటార్‌ పరిగణనలోకి తీసుకొని, దానికి ఒక మోడల్‌ని క్రియేట్‌ చేస్తుంది. దాని నుంచి ఇనీషియల్‌ ప్రొడక్ట్‌ వచ్చే వరకు సాయం చేస్తుంది. ఐడియాని గ్లోబల్‌ లెవల్‌కి కూడా తీసుకెళతాం. అవసరమైతే పెట్టుబడి పెడతాం. కాలేజ్‌, యూనివర్సిటీ స్థాయిలోనూ ఇది కొనసాగిస్తాం.

ఇలా మాకు గతేడాది 24 దేశాల్లోని 450 వర్సిటీల నుంచి వెయ్యికి పైగా ఐడియాలొచ్చాయి. అందులోని ది బెస్ట్ అనదగ్గ 3 ఐడియాలను ఫైనల్‌ చేశాం. వాటికి వంద నుంచి వెయ్యి డాలర్ల వరకు ప్రైజ్‌ మనీ కూడా అందింది’ అని సుబ్బరాజు పేరిచర్ల వివరించారు. TIE గ్లోబల్‌ సమ్మిట్-2022 ఈ ఏడాది డిసెంబర్‌ 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుండటం విశేషం.

Exit mobile version