NTV Telugu Site icon

Telio EV CEO Amit Singh: ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే లీడింగ్‌లో నిలుస్తాం

Telio Ev Ceo Amit Singh

Telio Ev Ceo Amit Singh

Telio EV CEO Amit Singh: విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ సర్వీసుల విషయంలో తమ సంస్థ భవిష్యత్తులో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లీడింగ్‌లో ఉంటుందని ‘టెలియొ ఈవీ’ ఫౌండర్ సీఈఓ అమిత్‌ సింగ్‌ తెలిపారు. ఈవీ సెగ్మెంట్‌లో మరింత మంచి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈవీలు ఎక్కువ ఉంటే ఛార్జింగ్‌ స్టేషన్లు లేవని, ఛార్జింగ్‌ స్టేషన్లు ఎక్కువ ఉంటే వాటికి తగ్గ వాహనాలు లేవని చెప్పారు. ఈ లోటును భర్తీ చేయటానికే తాము ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

2030 నాటికి ఇండియాలో 80 శాతం ఈవీ టూ వీలర్‌, త్రీ వీలర్‌ వాహనాలే ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలోనూ 70 శాతం విద్యుత్‌ వాహనాలు వాడుకలోకి రానున్నాయని వెల్లడించారు. తక్కువలో తక్కువ 30 శాతం ఈవీ కార్లు రోడ్ల మీద తిరుగుతాయని చెప్పారు. ఈవీ సెక్టార్‌, టెక్నాలజీ, బ్యాటరీలు, మోటార్లు, ఛార్జర్లు రోజురోజుకీ డెవలప్‌ అవుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో ఈ రంగంలోకి మరింత మంది ఎంట్రప్రెన్యూర్లు, ఫండ్స్‌ వస్తాయని తెలిపారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే ‘టెలియొ ఈవీ’ సీఈఓ అమిత్‌ సింగ్‌ ‘ఎన్-బిజినెస్‌ ఇన్‌సైడర్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడొచ్చు. ఆ వీడియో ఈ కిందనే ఉందని గమనించగలరు.