NTV Telugu Site icon

TCS Recruits Freshers: కొత్త ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్షన్నర వరకు ఉద్యోగ నియామకాలు

Tcs Recruits Freshers

Tcs Recruits Freshers

TCS Recruits Freshers: ఐటీ రంగంలో మేజర్‌ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌.. TCS.. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్షా పాతిక వేల నుంచి లక్షన్నర మంది వరకు ఎంప్లాయీస్‌ని తీసుకోనున్నట్లు TCS CEO and MD రాజేష్‌ గోపీనాథన్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

read more: Minister KTR : 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌

ఇంత భారీఎత్తున రిక్రూట్‌మెంట్‌ చేపట్టబోతున్నామంటే సంస్థ భవిష్యత్‌ పట్ల తమకు ఎంత ప్రగాఢ విశ్వాసం ఉందో అర్థంచేసుకోవచ్చని చెప్పారు. ఇదిలాఉండగా.. దాదాపు 40 వేల మంది ఫ్రెషర్స్‌కి అవకాశం ఇస్తామని TCS ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు CHRO మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు TCS.. 42 వేల మంది ఫ్రెషర్స్‌కి అవకాశం కల్పించింది. డిసెంబర్‌ క్వార్టర్‌లోనే 7 వేల మందికి ఉద్యోగం ఇచ్చింది.

2022 ప్రారంభంలో కంటే 2023 ప్రారంభంలో హైరింగ్‌ సెంటిమెంట్‌ ఆశాజనకంగా ఉంటుందని గోపీనాథన్‌ డిసెంబర్‌ నెలలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో TCS నుంచి 2 వేల మందికి పైగా ఉద్యోగులు వెళ్లిపోయారు. దీనికి కారణం డిమాండ్‌ లేకపోవటం కాదని స్పష్టం చేశారు.

Show comments