NTV Telugu Site icon

Stock Selection: స్టాక్‌ మార్కెట్‌లో షేర్లను దేని ఆధారంగా కొనాలి?

Stock Selection

Stock Selection

Stock Selection: స్టాక్‌ మార్కెట్‌లో షేర్లను కొనే ముందు కంపెనీల అనాలసిస్‌ చేయాలి. దీనికి రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 1. క్వాలిటేటివ్‌ 2. క్వాంటిటేటివ్‌. క్వాలిటేటివ్‌ అనాలసిస్‌లో అసలు ఆ కంపెనీ బిజినెస్‌ మోడల్‌, బలాలు, బలహీనతలు, అవకాశాలు తదితరాలను పట్టించుకోవాలి. కంపెనీకి ఏయే సెగ్మెంట్లలో రెవెన్యూ వస్తోందో, ఏయే సెగ్మెంట్లు ఇంప్రూవ్‌ అవుతున్నాయో చూడాలి. తర్వాత.. ప్రమోటర్స్‌ బ్యాంక్‌గ్రౌండ్‌ మరియు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను విశ్లేషించుకోవాలి. ప్రమోటర్‌ బ్యాక్‌గ్రౌండ్‌కి ఉదాహరణగా రిలయెన్స్‌లోని రెండు గ్రూపుల గురించి చెప్పుకోవచ్చు. 1. అనిల్‌ అంబానీ 2. ముఖేష్‌ అంబానీ.

ఈ ఇద్దరిలో ఇప్పుడు ఎవరు ఫామ్‌లో ఉన్నారో అందరికీ తెలిసిందే. అందువల్ల ఆ ప్రమోటర్‌ని బట్టి అతని కంపెనీలను, స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతోపాటు కంపెనీ మార్కెట్‌ షేరు పరిశీలించాలి. ఎగ్జాంపుల్‌ కోసం టెలికం రంగానికి వస్తే మేజర్‌ వాటా రిలయెన్స్‌ జియోదే. ఆ తర్వాత ఎయిర్‌టెల్‌, ఐడియా-వొడాఫోన్‌ ఉన్నాయి. ఈ సంస్థల మార్కెట్‌ షేర్‌ పెరుగుతోందా తగ్గుతోందా అనేదీ ముఖ్యమే. పోటీ సంస్థల కన్నా వీళ్లకి మార్కెట్‌ షేరు ఎక్కువ ఉందా లేదా అనేది గమనించాలి. కంపెనీల ప్లాంట్స్‌ లొకేషన్స్‌, డిస్ట్రిబ్యూషన్స్‌, నెట్‌వర్క్స్‌, కీలకమైన బ్రాండ్స్‌, మేజర్‌ కస్టమర్స్‌, కాస్ట్‌ కాంపోనెంట్స్‌ (ఖర్చులు) వంటి వివరాలు తెలుసుకోవాలి.

ఉదాహరణకు ఒక మేజర్‌ కస్టమర్‌ చేజారిపోతే ఆ సంస్థ బిజినెస్‌ తీవ్రంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలాగే.. రెగ్యులేటరీ అథారిటీ ఎప్పటికప్పుడు సవరించే రూల్స్‌, రెగ్యులేషన్స్‌ వల్ల కంపెనీ పనితీరుపై ఏ మేరకు ప్రభావం పడుతుందో అంచనా వేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం స్టాక్‌ మార్కెట్‌లో షేర్లను కొనేముందు ఇలా.. చాలా విషయాలను, విభిన్న కోణాలను దృష్టిలో పెట్టుకోవాలి.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ‘వెల్త్‌ ట్రీ గ్రూప్‌’ ఫౌండర్, సీఈఓ ప్రసాద్ దాసరి ‘ఎన్‌-బిజినెస్‌’కి ఇచ్చిన ఫిన్‌టాక్‌ చూడొచ్చు. ఆ వీడియో లింక్‌.. కిందే ఉందని గమనించగలరు. ఏమైనా అనుమానాలు ఉన్నా, సలహాలు, సూచనలు కావాలన్నా ప్రసాద్ దాసరిని ఫోన్ నంబర్ లేదా ఇ-మెయిల్ ద్వారా సంప్రదించొచ్చు