Sleeping in Office: ఆఫీసులో పనిచేయకుండా నిద్రపోతే ఉద్యోగం ఊడటం ఖాయం. కంపెనీ ఏదైనా అది ఫాలో అయ్యే పాలసీ మాత్రం ఇదే. కానీ.. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ అందరి కన్నా భిన్నంగా ఆలోచించింది. నిద్రపోయేందుకు ప్రత్యేకంగా ఒక అర్ధ గంట సమయాన్ని కేటాయించింది. పని వేళల్లో అలసటగా అనిపించినప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకునేందుకు అనుమతిస్తోంది.
read more: IMF bailout for Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కనున్న ద్వీపదేశం
ఈ మేరకు ‘రైట్ టు న్యాప్’ అనే పాలసీని తెర మీదికి తీసుకొచ్చింది. రైట్ టు న్యాప్.. అంటే.. కునుకు తీయటం కూడా ఒక హక్కే అని అర్థం. ఇలా ఓ సరికొత్త హక్కును ఉద్యోగులకు కల్పిస్తున్న ఆ సంస్థ పేరు.. వేక్ ఫిట్ సొల్యూషన్స్. మనిషి కంటి నిండా నిద్రపోతేనే శరీరం.. మెదడు.. మనసు.. అన్నీ ఉత్సాహంగా పనిచేస్తాయి. రోజుకి కనీసం ఏడెనిమిది గంటలు పడుకుంటే.. పనిలో.. ఆలోచనలో.. ఆచరణలో ఉల్లాసం ఉట్టిపడుతుంది.
డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్పే ఈ మాటలను వేక్‌ఫిట్ సొల్యూషన్స్ సంస్థ తూచా తప్పకుండా పాటిస్తోంది. ఇందులో భాగంగా మార్చి నెల 17వ తేదీన ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకంగా ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. ఆ రోజంతా హాయిగా నిద్రపోయి ఆ మరుసటి రోజు రెట్టించిన ఉత్సాహంతో డ్యూటీకి రావాలంటూ ఆఫర్ ఇచ్చింది.
ఈ విషయాన్ని లింక్డిన్‌లో షేర్ చేసింది. మీరు ప్రశాంతంగా సేదతీరేందుకు ఇది సరైన అవకాశం అంటూ ఉద్యోగులకు మెయిల్ కూడా పంపింది. మెయిల్‌కి సర్‌ప్రైజ్ హాలిడే అనే టైటిల్ పెట్టి ఆకట్టుకుంది. ఎంప్లాయీస్ ఆరోగ్యం కోసం వినూత్న నిర్ణయం తీసుకున్న ఈ సంస్థ చేసే వ్యాపారం.. పరుపులు.. సోఫాలు.. విక్రయించటం.