NTV Telugu Site icon

Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..

Salary Hike

Salary Hike

Salary Hike: గతేడాది 78 శాతం మందికి మాత్రమే శాలరీ పెరిగింది. కానీ.. ఈ ఏడాది 90 శాతం మంది ఉద్యోగులు తమ వేతనం పెరగాలని కోరుకుంటున్నారు. కిందటి సంవత్సరం యావరేజ్‌గా 4 నుంచి 6 శాతం మాత్రమే శాలరీ హైక్ అయింది. ఈసారి మాత్రం కనీసం 4 నుంచి 6 శాతం పెరగాలని 20 శాతం మంది ఆశిస్తున్నారు.

read more: Land Rates in Hyderabad: హైదరాబాద్‌లో భూముల రేట్లు.. యావరేజ్‌గా గజం స్థలం ఎంతుందంటే?..

10 నుంచి 12 శాతం ఇంక్రిమెంట్ వస్తుందని 19 శాతం మంది అంచనాల్లో మునిగిపోయారు. ఈ విషయాలను ఏడీపీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. పీపుల్ ఎట్ వర్క్ 2023 పేరుతో విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. ఈ సంవత్సరం శాలరీ పెంచటానికి అవకాశం లేకపోతే కనీసం బోనస్ అయినా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.

పెయిడ్ హాలిడేస్ మరియు ట్రావెల్ అలవెన్సులు లేదా ట్రావెల్ ఇన్‌సెంటివ్స్‌కి మోక్షం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఏడీపీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 32 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. వీళ్లంతా 17 దేశాలకు చెందినవారు కావటం గమనార్హం.

ఇందులో భారతీయులు సైతం 2 వేల మంది ఉన్నారు. రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో అదే స్థాయిలో జీతం కూడా పెరిగితే బాగుంటుందని, ఆర్థికంగా ఇబ్బంది ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. ఏడీపీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉండగా.. ఖర్చుల కోణంలో కాకపోయినా.. కెరీర్ యాంగిల్‌లో అయినా శాలరీ ఇ‌న్‌క్రీజ్ కావాలనుకోవటం మానవ సహజమని నిపుణులు పేర్కొన్నారు.