Minister KTR: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ సామాజిక మాద్యమం ట్విట్టర్‌లో ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. పబ్లిక్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న టాప్-30 లీడర్లు మరియు సంస్థల లిస్టులో చోటు సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా 12వ ర్యాంకును పొందారు. ఈ జాబితాలో ఇండియాకి చెందిన కేవలం ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మంత్రి కేటీఆర్ కావటం విశేషం.
read more: Startups Funding Down: స్టార్టప్‌లు కాదు.. స్టార్ట్‌డౌన్‌లు. గతేడాది తగ్గిన ఫండింగ్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు-2023 జరుగుతున్న సందర్భంగా కెకోర్ అనలిటిక్స్ అనే సంస్థ ఈ లిస్టును విడుదల చేసింది. ఇందులో కేటీఆర్ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్.. @KTRTRS ఉండటం గమనించాల్సిన అంశం. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన అఫిషియల్ ట్విట్టర్ ఖాతా.. @MinisterKTR.. 22వ స్థానాన్ని సొంతం చేసుకుంది. కేటీఆర్‌తోపాటు ఈ టాప్-30లో ఉన్న మరో భారతీయుడి పేరు రాఘవ్ చద్దా.
ఈయన ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ. లిస్టులో రాఘవ్ చద్దా 23 ర్యాంక్ కైవం చేసుకున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆఫ్‌లైన్‌లోనే కాదు.. ఆన్‌లైన్‌లో కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన వివిధ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. వాటి ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలను అప్పటికప్పుడు అధికారులకు తెలియజేసి సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.