NTV Telugu Site icon

Minister KTR Investment: హైదరాబాద్ విద్యార్థినిల స్టార్టప్‌కి రూ.8 లక్షల సొంత డబ్బు

Minister KTR Investment

Minister KTR Investment

Minister KTR Investment: హైదరాబాద్‌లోని ఇద్దరు పాఠశాల విద్యార్థినిల మానస పుత్రిక అయిన డిజి జ్ఞాన్ అనే స్టార్టప్‌కి మంత్రి కేటీఆర్ ముచ్చటపడి సొంతగా 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ డిజిటల్ స్టార్టప్‌ వేదికను ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల కోసం రూపొందించారు. నాలెడ్జ్ షేరింగ్ మరియు సెల్ఫ్ లెర్నింగ్ లక్ష్యంగా అభివృద్ధి పరిచారు.

read more: Hyderabadis Ott Mentality: హైదరాబాద్‌లోని ఓటీటీ సబ్‌స్క్రైబర్లకు సంబంధించిన ఆసక్తికర అంశాలు

తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎన్.మానసరెడ్డి మరియు పదో తరగతి విద్యార్థిని నఫీసా అంజుమ్ ఈ స్టార్టప్‌ని స్టార్ట్ చేశారు. బోడుప్పల్‌లోని పల్లవీ మోడల్ స్కూల్‌ నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్‌లో వాళ్లకి ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది. గ్రామీణ ప్రాంతాల విద్యా్ర్థుల్లో.. ప్రధానంగా.. బాలికల్లో డిజిటల్ అక్షరాస్యత లోపించటాన్ని ఈ ఇద్దరు స్టూడెంట్లు.. ఫీల్డ్ ట్రిప్‌లో గుర్తించారు.

అనంతరం.. డిజి జ్ఞాన్ స్టార్టప్ దిశగా ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు. ఈ స్టార్టప్ ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇందులో.. డిజిటల్ అక్షరాస్యతతోపాటు ఉపాధి మరియు సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను నేర్పనున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్రతాప్‌సింగారం, కాచవానిసింగారం, ఏదులాబాద్ మరియు ముత్యాలగూడ గ్రామాల్లోని 500 మందికిపైగా విద్యార్థులకు ఈ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

వచ్చే ఏడాదికి పైగా కాలంలో.. డిజి జ్ఞాన్ సేవలను విస్తరించేందుకు 50 మంది వాలంటీర్లను నియమించుకోనున్నారు. తద్వారా 25 గ్రామాల్లోని వెయ్యి మందికిపైగా విద్యార్థులకు సర్వీస్ చేస్తారు. ఫలితంగా ఈ స్టార్టప్ ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ స్టార్టప్‌కి ఫండింగ్ చేస్తానని మంత్రి కేటీఆర్ మార్చి నెల 8వ తేదీన ‘‘వి హబ్’’ ఐదో వార్షికోత్సవం సందర్భంగా మాటిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ స్టూడెంట్లు ఇటీవల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ని కలిసి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు.

దీంతో ఆయన.. ఆ విద్యార్థులను స్టార్టప్‌కి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. డిజి జ్ఞాన్ స్టార్టప్.. ఫైనాన్షియల్‌గా ఎలా వర్కౌట్ అవుతుంది?, దానికి మెంటార్ అండ్ అడ్వైజర్ ఎవరు?, రోడ్ మ్యాప్ ఏంటి? పెట్టుబడి మీద రాబడి ఎలా వస్తుంది? అని ఆరా తీశారు. మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు వాళ్లు సమర్థవంతంగా సమాధానాలు చెప్పారు. దీంతో ఆయన ముచ్చటపడి 8 లక్షల రూపాయల సీడ్ క్యాపిటల్ ఇచ్చేందుకు ఓకే అన్నారు.