IT Stocks Fallen: 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఈ రేంజ్లో పడిపోవటం ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Stocks Fallen: అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. దీంతో ఆ ప్రభావం ఇండియన్ టెక్నాలజీ కంపెనీల పైన పడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. మరీ ముఖ్యంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గతేడాది కన్నా ఈసారి 24 శాతం డౌనైంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం ఇలా జరగటం ఇదే తొలిసారి.
వరుసగా ఐదేళ్లు లాభాలు ఆర్జించిన ఐటీ స్టాక్స్ ఈ సంవత్సరం నష్టాల్లోకి జారుకోవటం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. విప్రో, టెక్ మహింద్రా, ఎంఫసిస్ సంస్థల మార్కెట్ వ్యాల్యూ 40 శాతానికి పైగా పడిపోయింది. స్టార్టప్‌లే కాదు.. పెద్ద కంపెనీలు సైతం వందల సంఖ్యలో ఉద్యోగులకు లేఫ్‌లు ప్రకటించాయి. వెంచర్ క్యాపిటలిస్టుల పెట్టుబడులు తగ్గిపోయాయి.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
India Growth: ఇండియా వృద్ధిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ కామెంట్స్
ఇండియన్ ఎకానమీ అంతర్జాతీయ పరిస్థితులను తట్టుకొని నిలబడగలుగుతున్నప్పటికీ టెక్ ఇండస్ట్రీ మాత్రం వచ్చే ఏడాది కూడా ఒడిదుడుకులకు లోను కానుంది. మాంద్యం భయాలు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెరుగుతున్న బ్యాంకుల వడ్డీ రేట్లు గ్లోబల్ ఐటీ సంస్థల ఆదాయాలను, అమ్మకాలను, గ్రోత్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా.. ఇంటర్నేషనల్ క్లయింట్ల మీదే మేజర్‌గా ఆధారపడ్డ ఇండియన్ ఐటీ కంపెనీల రెవెన్యూ పరోక్షంగా ప్రభావితమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇండియాలో 3వ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వచ్చే ఏడాది ఆదాయ అంచనాలను కుదించుకుంది. టెలికం కంపెనీలు సైతం ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. నవ తరం స్టార్టప్‌లకూ ఈ సెగ తగులుతోంది. స్నాప్‌డీల్, ఫార్మ్ఈజీ, మొబీక్విక్, డ్రూమ్ వంటి కంపెనీలు లిస్టింగ్ ప్లాన్లను పక్కన పెట్టాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగటంతోపాటు లేబర్ మార్కెట్ బలహీనపడటం ఇండియన్ ఐటీ కంపెనీల అవకాశాలకు ప్రతికూలంగా మారనుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!