Indian Smart Watch Market: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మన దేశం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌వాచ్ మార్కెట్‌గా అవతరించింది. ఇండియన్ స్మార్ట్‌వాచ్ మార్కెట్ ఏకంగా 171 శాతం గ్రోత్‌ను నమోదు చేసింది. ఇది గతేడాదితో పోల్చితే 30 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ వృద్ధికి ముఖ్యంగా బేసిక్ స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్ దోహపడింది.
దేశీయంగా Noise, Fire Boltt మరియు boAtలు 79 శాతం వాటాతో టాప్-3 స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌లుగా ఎదిగినట్లు కౌంటర్‌పాయింట్ రిపోర్ట్ వెల్లడించింది. వరల్డ్ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో భారతదేశం గతేడాది మూడో ర్యాంక్‌కే పరిమితమైంది. అలాంటిది ఈ సంవత్సరం గ్లోబల్ మార్కెట్‌లో 30 శాతం షేరుతో అగ్ర స్థానాన్ని ఆక్రమించటం విశేషం. మిగతా దేశాల మార్కెట్లు కూడా గ్రోత్‌ను నమోదు చేసినప్పటికీ చైనా మరియు యూరప్ మార్కెట్లలో మాత్రం తగ్గుదల చోటుచేసుకుంది.
read more: Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
నార్త్ అమెరికాలో 21 శాతం వృద్ధి నెలకొనగా చైనా మార్కెట్ 6 శాతం పడిపోయింది. ఇండియన్ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో 80 శాతం వాటాను దేశీయ సంస్థలే కైవసం చేసుకున్నాయి. లోకల్ బ్రాండ్ అయిన Noise ప్రపంచ వ్యాప్తంగా సైతం 3వ ర్యాంక్ పొందింది. దీనికన్నా ముందు యాపిల్ మరియు శామ్‌సంగ్ మాత్రమే ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం కలిగిన స్మార్ట్‌వాచ్‌లకు కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.