NTV Telugu Site icon

Indian Economy Growth in 2023: వచ్చే ఏడాది మన ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధి అంచనా

Indian Economy Growth In 2023

Indian Economy Growth In 2023

Indian Economy Growth in 2023: వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు వృద్ధిని అధిగమించగలదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2023లో మూలధన ఖర్చులు పుంజుకోవటం, వినియోగ సామర్థ్యం అధికం కావటం మరియు మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయం పెరగటం వంటివి ఈ దిశగా కీలక పాత్ర పోషించనున్నాయని చెబుతున్నారు.

గ్లోబల్‌ ఎకానమీ పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థకు ఆటంకాలు కలిగించనున్నప్పటికీ వృద్ధి మాత్రం 4.8 శాతం నుంచి 5.9 శాతం వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. గ్లోబల్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ అంచనాల కన్నా ఇది 1.8 శాతం ఎక్కువని విశ్లేషకులు గుర్తు చేశారు. వస్తువులకు, ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అస్థిరతలు ఇండియా వృద్ధికి ప్రధాన అవరోధాలు అని కొటక్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ ప్రతినిధులు చెప్పారు.

read also: Subscribers Want Free Content On OTTs: ఓటీటీలో ఉచిత కంటెంట్‌ వైపే ప్రేక్షకుల మొగ్గు

ప్రపంచ బ్యాంకు కూడా ఇండియా జీడీజీ గ్రోత్‌ను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి అప్‌గ్రేడ్‌ చేయటాన్ని ప్రస్తావించారు. దీనికితోడు పన్నుల వసూళ్లు గతేడాది కన్నా పెరిగాయి. సామర్థ్య వినియోగం 17 త్రైమాసికాల గరిష్టానికి చేరటం, విదేశీ మారక నిల్వలు 550 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను మరోసారి దాటడం వంటివి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి సానుకూల సంకేతాలని పరిశీలకులు వివరించారు.

ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో విదేశీ పెట్టుబడిదారులు ఇండియన్‌ మార్కెట్‌ను వీడిపోగా రెండో అర్ధ భాగంలో ఈ ట్రెండ్‌ రివర్స్‌ అయింది. జులై, నవంబర్‌ మధ్య కాలంలో 92,763 కోట్ల రూపాయల ఎఫ్‌పీఐలు మన మార్కెట్‌లోకి ప్రవహించాయి. ఇండియా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పునరుద్ధరణ సంకేతాలను చూపుతోందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఉపాధి, క్రెడిట్ ఆఫ్‌టేక్, ఆటోమొబైల్‌ అమ్మకాలు, వాణిజ్యం అనే నాలుగు కీలక సూచికలను ఆ రిపోర్ట్‌ రిఫరెన్స్‌గా చూపింది.