NTV Telugu Site icon

India Wanted Pilots: ఇండియాకి కావాలి పైలట్స్. కానీ..

Pilots

Pilots

India Wanted Pilots: విమానయాన రంగం అభివృద్ధి దిశగా రెక్కలు తొడిగి రెప రెప లాడుతుండటంతో ఇండియాకి ఏటా వెయ్యి మందికి పైగా పైలట్లు అవసరమనే అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఐదేళ్లపాటు పైలట్లకు ఇదే స్థాయిలో డిమాండ్ నెలకొంటుందని చెబుతున్నారు. అయితే మన దేశానికి అవసరమైన సంఖ్యలో పైలట్లకు శిక్షణ ఇవ్వటానికి సరిపోను మౌలిక వసతులు లేవని నిపుణులు అంటున్నారు. గత ఐదేళ్లలో కమర్షియల్ పైలట్ లైసెన్సులు పొందినవారి సంఖ్య.. పెరుగుతున్న డిమాండుతో పోల్చితే చాలా తక్కువ గుర్తుచేస్తున్నారు.

read more: World Bank Revised India GDP Growth: మన దేశ జీడీపీ గ్రోత్‌ రేట్‌ 6.9 శాతానికి పెంపు

సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డేటా ప్రకారం.. 2019లో కమర్షియల్ పైలట్ లైసెన్సులు పొందినవారి సంఖ్య 744 కాగా అది 2020 నాటికి 578కి తగ్గి 2021లో 862కి పెరిగింది. దీనికితోడు ప్రతి సంవత్సరం దాదాపు 200 మంది పైలట్లు రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో పైలట్ల ట్రైనింగుకి మన దగ్గర మౌలిక వసతులు లేకపోవటంతో పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ లోపాన్ని సవరించటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ప్రాపర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం లోటుగా మారింది. మరో వైపు ప్రభుత్వమేమో పైలట్ల కోరతలేదని తేల్చిచెబుతోంది.