సాధారణంగా పాముకు ముంగిసకు అసలు పడదు. రెండు ఎదురు పడ్డాయా అంటే సమరశంఖం పూరించాల్సిందే. పాము, ముంగిస తీవ్ర స్ధాయిలో కొట్టుకుంటాయి. చాలా సార్లు మనం పాము, ముంగిసలు పొట్లాడుకోవడం చూసుంటాం. అయితే తాజాగా ఓ రోడ్డుపై పాము, ముంగిస పొట్లాడుకున్నాయి. బద్ధ శత్రువులుగా పిలువబడే పాము, ముంగీస్ మధ్య జరిగిన భీకర యుద్ధం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే పట్టపగలు ఒక పాము రోడ్డు దాటేందుకు తీవ్ర స్థాయలో ప్రయత్నిస్తోంది. వెనుక నుంచి వచ్చిన ఓ ముంగిస ఆ పాముపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పడగ విప్పిన పాము ముంగిసతో పోరాడింది. అయినప్పట్టికి ముంగిసతో గెలవలేక పాము పారిపోయేందుకు సిద్ధపడింది. అయినా వదలని ముంగిస దానిపై విరుచుకుపడింది. పామును నోటితో కరుచుకున్న ముంగిస అక్కడి నుంచి పొదల్లోకి పారిపోయింది.
అయితే..ఈ ఘటనను అక్కడే నిలబడి చూసిన కొందరు మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో 5 లక్షల 78 వేల 928 మంది వీక్షించారు. పాము వర్సెస్ ముంగీస్ ఫైట్ అందరికీ సినిమా తరహా థ్రిల్ ఇవ్వడంతో నెటిజన్లు దానిని విపరీతంగా షేర్ చేస్తున్నారు.
