DRI notice to Samsung: పన్ను ఎగవేత ఆరోపణల కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్.. DRI.. శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 1728 కోట్ల రూపాయలకు పైగా డబ్బును వడ్డీతో సహా పన్ను రూపంలో మీ నుంచి ఎందుకు వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పన్ను కట్టకుండా తప్పించుకున్నందుకు కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్‌కి పెనాల్టీ ఎందుకు విధించకూడదో కూడా చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
read more: Startups Funding Down: స్టార్టప్‌లు కాదు.. స్టార్ట్‌డౌన్‌లు. గతేడాది తగ్గిన ఫండింగ్
ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సైతం నోటీసులు ఇచ్చింది. 4G LTE నెట్‌వర్క్ పరికరాల సాంకేతిక వర్గీకరణకు సంబంధించిన సర్వీసును ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. శామ్‌సంగ్‌కి అందించింది. అందువల్ల ఆ సంస్థ పైన కూడా DRI దర్యాప్తు జరుపుతోంది. రిమోట్ రేడియో హెడ్ అనే నెట్‌వర్కింగ్ పరికరాన్ని దిగుమతి సమయంలో సాంకేతికంగా తప్పుడు కేటగిరీలో చూపి పన్ను కట్టకుండా ఎగ్గొట్టారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ఆరోపిస్తోంది. అయితే.. తాము చేసినదాంట్లో తప్పేం లేదని, DRI షోకాజ్ నోటీసుపై న్యాయ పోరాటం చేస్తామని శామ్‌సంగ్ అంటోంది.