CometLabs: ప్రతి కంపెనీలోనూ సరైన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవటం అనేది చాలా కీలకమైన ప్రక్రియ. ఈ మేరకు రెజ్యూమ్‌లను ఆహ్వానించటం, వాటిని స్క్రుటినైజ్ చేయటం, షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయటం తదితర దశలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే.. ఫైనల్‌గా ప్రతిభావంతులను ఎంపిక చేయటం మరో ఎత్తు.
ఇందులో భాగంగా ఒకటికి రెండు సార్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి.. పర్సనల్ ఇంటర్యూ. రెండు.. టెక్ రౌండ్. పర్సనల్ ఇంటర్వ్యూని హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ చేపడుతుంది. టెక్ రౌండ్ కోసం సంస్థలు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించాలి.
అలాంటి అప్‌డేటెడ్ సాంకేతికతలను కోమెట్‌ల్యాబ్స్ అనే కంపెనీ డెవలప్ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎన్టీవీ బిజినెస్ ఛానల్.. కోమెట్‌ల్యాబ్స్ ఫౌండర్ ప్రశాంత్ కటియార్‌ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియో మీకోసం..