NTV Telugu Site icon

Christmas Effect on Stock Market: ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చైర్మన్‌ ఆర్‌.వెంకటరామన్‌ అంచనా

Christmas Effect On Stock Market

Christmas Effect On Stock Market

Christmas Effect on Stock Market: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి మొదలైంది. ఆ పండగ ప్రభావం ఇండియన్‌ స్టాక్‌మార్కెట్‌ పైన కూడా పాజిటివ్‌గా కనిపించనుందని విశ్లేషకులు అంటున్నారు. పిల్లలకు, పెద్దలకు కేకులను, ఆట బొమ్మలను బహుమతులుగా తేవటం ద్వారా క్రిస్మస్‌ తాత.. శాంతాక్లాజ్‌.. ఏవిధంగా అయితే సర్‌ప్రైజ్‌ చేస్తారో.. అదేవిధంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ నిఫ్టీని కూడా రైజ్‌ చేస్తారని చెబుతున్నారు. తద్వారా.. స్టాక్స్‌ వ్యాల్యూ ర్యాలీకి పరోక్షంగా దోహదపడతారని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ చివరి నాటికి నిఫ్టీ 18 వేల 900 పాయింట్ల నుంచి 19 వేల పాయింట్ల వరకు టార్గెట్‌ రీచ్‌ అవుతుందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చైర్మన్‌ ఆర్‌.వెంకటరామన్‌ తెలిపారు. ఇయర్‌ ఎండింగ్‌లో నిఫ్టీ 80 శాతం వరకు గ్రీన్‌ కలర్‌లోనే క్లోజ్‌ అయ్యే అవకాశం ఉందని గత అనుభవాలు చెబుతున్నాయి. డిసెంబర్‌ నెల అత్యధిక నెలవారీ సగటు ఆదాయాన్ని.. అంటే.. 3 పాయింట్‌ 2 శాతం ప్రాఫిట్స్‌ని ఇచ్చినట్లు అధ్యయనంలో తేలింది.

భారతదేశం ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతుందని, దీంతో.. రాబోయే నెలల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికర కొనుగోలుదారులుగా నిలిచిపోతారని ఐఐఎల్‌ సెక్యూరిటీస్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.