Site icon NTV Telugu

Viral Video: బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బ్యాట్స్మెన్లు.. వీడియో వైరల్

Viral Pak

Viral Pak

Viral Video: ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టాల్సి వస్తుంది. ఆ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనపై సొంత దేశం మాజీ ఆటగాళ్లే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎఫెక్ట్ పాకిస్తాన్ లో కొట్టిందేమో…. పాకిస్తాన్ లో జరిగిన ఓ టోర్నమెంట్ మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్ మెన్లు కొట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఇలాంటి పరిణామాలు ఎక్కడ చూసి ఉండరు. సాధారణంగా క్రికెట్ లో గొడవలు జరిగితే ప్రత్యర్థి టీమ్ తో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు ఒకే జట్టు బ్యాట్స్ మెన్లు బ్యాట్లతో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

Read Also: Tula Uma: తుల ఉమ ఇంటికి క్యూ కడుతున్న నేతలు.. పార్టీలో చేరాలని కాంగ్రెస్ ఆహ్వానం!

వాస్తవానికి.. నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ రనౌట్ అవుతాడు. దాంతో తన సహచర ఆడగాడిపై కోపంతో తిట్టుకుంటూ బయటికి వెళ్లిపోతుంటాడు. అయితే ఉన్నట్టుండి క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్ పరుగెత్తుకుంటూ వచ్చి తన తోటి బ్యాట్స్‌మెన్‌పై బ్యాట్ తో దాడి చేస్తాడు. దీంతో కొంతమంది వచ్చి వారిని ఆపుతారు. అంతటితో ఆ గొడవ సద్దుమణుగుతుంది. ఈ ఫన్నీ వీడియో @gharkekalesh అనే ఐడీతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 6 లక్షల 40 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు.

Read Also: Haris Rauf: పాకిస్తాన్ బౌలర్ చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే..!

Exit mobile version