Site icon NTV Telugu

Biryani Ball:మ్యాగిలా.. అందుబాటులోకి రెండు నిమిషాల బిర్యానీ బాల్..

Untitled Design (3)

Untitled Design (3)

రెండు నిమిషాల మ్యాగీలా… ఇప్పుడు రెండు నిమిషాల బిర్యానీ కూడా అందుబాటులోకి వచ్చింది. రోజురోజుకూ మన ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. గంటల తరబడి వంటింట్లో కష్టపడాల్సిన అవసరం లేకుండా, కావాల్సిన ప్రతి రకం ఆహారం ఇప్పుడు మార్కెట్‌లో సులభంగా లభిస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టంట్ పరోటాలు, చపాతీలు, సూపులు వంటి అనేక ఫుడ్ ఐటమ్స్ వినియోగదారుల ముందుకు వచ్చాయి. తాజాగా, కేవలం రెండు నిమిషాల్లో తయారయ్యే “బిర్యానీ బాల్” కూడా మార్కెట్‌లోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కొందరు కంటెంట్ క్రియేటర్లు ‘బిర్యానీ బాల్’ పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోల ప్రకారం, బంతి ఆకారంలో ఉన్న బిర్యానీని ఒక పాత్రలో వేసి వేడి నీళ్లు పోస్తే, కేవలం కొన్ని సెకన్లలోనే అది విచ్చుకుని వేడి వేడి బిర్యానీగా మారిపోతోంది. చూడటానికి అచ్చం నిజమైన బిర్యానీలా కనిపించడం విశేషం. అయితే ఈ వీడియోలను చూసిన నెటిజన్లు మాత్రం ఇది ఏఐ ద్వారా రూపొందించిన క్రియేటివ్ వీడియో అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సరదాగా ఆ బిర్యానీ బాల్‌ను ‘పిండం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా, నిజమా కాదా అన్న దానితో సంబంధం లేకుండా బిర్యానీ బాల్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసిన వారిలో ఆసక్తి, ఆశ్చర్యం రెండూ కలగడంతో పాటు, ఇన్‌స్టంట్ ఫుడ్ ట్రెండ్ ఎంత వేగంగా మారుతోందో మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.

Exit mobile version