NTV Telugu Site icon

రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని క‌లిసిన వైసీపీ నేత‌లు…

స‌చివాల‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి విజ‌యా నందును కలిశారు వైసీపీ నేత‌లు. తిరుపతి ఎన్నికల్లో సోషల్ మీడియా వేదిక‌గా తమ పార్టీపై టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తుందని ఫిర్యాదు చేసారు. కృష్ణ ప‌ట్నం నుండి స‌త్య‌వేడు వ‌ర‌కు ఉన్న భూములను సెజ్ కోసం లాక్కుంటారంటూ  మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డిల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫిర్యాదు చేసారు వైసీపీ నాయకులు. సెజ్ కోసం భూములు లాక్కొంటారని గూడూరు, సూళ్లూరు పేట, స‌త్య‌వేడు ఎమ్మెల్యేలు తమ అనుచ‌రుల‌తో చెబుతున్నారంటూ సోష‌ల్ మీడియాలో టీడీపీ చేస్తోన్న త‌ప్పుడు ప్ర‌చారం పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌యా నందును కోరారు.