NTV Telugu Site icon

గుడ్‌న్యూస్‌.. ఇక టెట్ వ్యాలిడిటీ జీవితకాలం

టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు కాలం ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సంవ‌త్స‌రాలు ఉండ‌గా.. ఇక‌పై జీవిత‌కాలం ప‌నిచేయ‌నుంది.. దీనిపై కేంద్ర విద్యా మంత్రిత్వ‌శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.. గత ఏడాదిలో టెట్‌ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్‌ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉండ‌గా.. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్‌ రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారికి జీవిత‌కాలం వ్యాలిడిటీ ధృవీక‌ర‌ణ‌పై రాష్ట్రాలు మ‌రియు యూటీలు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాయ‌ని కేంద్రం పేర్కొంది.. కేంద్రం తాజా నిర్ణ‌యం ప్ర‌కారం.. ఒక‌సారి టెట్ అర్హ‌త సాధిస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ రాయాల్సిన ప‌నిలేదు.. టెట్ అర్హ‌తతో నిర్వ‌హించే గురుకుల‌, డీఎస్సీ లాంటి పోస్టుల‌కు ప‌రీక్ష‌లు రాసుకునే వెసులుబాటు ఉంటుంది.