Site icon NTV Telugu

పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలి : టిఎస్ యుటిఎఫ్

పదవ తరగతి పరీక్షలు రద్దైనాయి. దిగువ తరగతులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింనందున ఆన్లైన్ క్లాసులు కూడా వినే స్థితిలో విద్యార్థులు లేరు.ఉపాధ్యాయులు మాత్రం ప్రతిరోజూ పాఠశాలలకు హాజరౌతున్నారు. ఈ నేపద్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించి, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయటం సమంజసంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) భావిస్తున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి వినూత్న విద్యా పధకాన్ని ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నందున, ప్రస్తుతం ఉన్న ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాలల్లోగల వేలాది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయటానికి చర్యలు తీసుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి గత నెల 22న అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, అంతర్జిల్లా బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించటానికి వీలుగా వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని తద్వారా ఏర్పడిన ఖాళీల భర్తీకి ఉపాధ్యాయుల నియామక పరీక్ష(టిఆర్టీ) నిర్వహించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి రాష్ట్ర విద్యామంత్రిని కోరారు.

Exit mobile version