ఈరోజు ఉదయం సిరివెన్నెల పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు చేర్చారు. అక్కడ ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం సిరివెన్నెలకు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సిరివెన్నెల పార్థివదేహానికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నివాళులు అర్పించారు. గత రెండు సంవత్సరాల నుంచి సిరివెన్నెల గారితో నాకు అనుబంధం ఉంది. సమాజాం పట్ల చాలా గౌరవం కలిగిన వ్యక్తి. నేను ఈ వారంలోనే ఆయనను కలవాలి అనుకున్నాను. కోవిడ్ సమయంలో పోలీసులు మీద మంచి పాటలు రాసారు.. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న.. నా తరుపున, TSRTC తరుపున వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న” అంటూ సిరివెన్నెల మృతికి సంతాపం వ్యక్తం చేశారు సజ్జనార్.
Read Also : తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం సిరివెన్నెల : సాయి కుమార్
లెజెండరీ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. 66 ఏళ్ల గీత రచయిత దాదాపు 3000 పాటలకు సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. శాస్త్రి ఆకస్మిక మరణ వార్త తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు సీతారామశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు.