NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : మొదటి స్థానం కోసం ఢిల్లీ-బెంగళూరు మధ్య పోటీ

ఈరోజు ఐపీఎల్ 2021 లో ఈరోజు గత మ్యాచ్ లలో హైదరాబాద్ పై సూపర్ ఓవర్ విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై చేతిలో ఘోరంగా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఈ రెండు జట్లకు షాక్ తగిలింది. అదేంటంటే కరోనా కారణనంగా ఈ ఐపీఎల్ నుండి ఢిల్లీ స్టార్ స్పిన్నర్ అశ్విన్ తప్పుకోగా బెంగళూరు జట్టు నుండి ఆసీస్ ఆటగాళ్లు ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్ వెళ్లిపోయారు. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ లవ్ ఎవరు విజయం సాధిస్తే వారు 10 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకుంటారు. అయితే ప్రస్తుతం ఆ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.