మూడు రోజుల నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసరప్రాంతాల నుండి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వరకు ఏర్పడినది. మరియు ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ర్ట దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి మి ఎత్తు వద్ద ఏర్పడినది.
ఈ రోజు (30వ తేదీ) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు మరియు రేపు (1వ తేదీ)
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు మరియు ఎల్లుండి (2వ తేదీ) ఉరుములు, మెరుపులు, మరియు ఈదురగాలులతో కూడిన వర్షము ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు:-
ఈ రోజు (30వ తేదీ) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, మరియు ఈదురగాలులతో (గంటకి 30 నుండి 40కిమి వేగంతో ) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు మరియు రేపు,(1వ తేదీ) ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురగాలులతో (గంటకి 30 నుండి 40కిమి వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఎల్లుండి (2వ తేదీ) రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో (గంటకి 30 నుండి 40కిమి వేగంతో )కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు (ఉత్తర,తూర్పు, సెంట్రల్, పశ్చిమ తెలంగాణా జిల్లాలలో)ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.