NTV Telugu Site icon

తెలంగాణకు మరోసారి వర్ష సూచనా…

నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిమీ ఎత్తు వరకు  ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిమి నుండి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరియు కేరళ తీరం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉపరితల ద్రోణి/ గాలి విచిన్నతి ఏర్పడింది. రాగల మూడు రోజులు (15,16,17వ.తేదీలు)  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణాలో  ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం వుంది.

వాతావరణ హెచ్చరికలు:-
రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం తెలంగాణాలో ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది.