Site icon NTV Telugu

బోర్డ్ ఆప్షన్స్ నచ్చక పోతే కరోనా తీవ్రత తగ్గాక పరీక్ష రాసే అవకాశం..?

కరోన కేసులు పెరుగుతుండడం తో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం జూన్ ,జులై లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహణ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలు ఎంటనే దాని పై దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్. ప్రస్తుతం సెకండ్ ఇయర్ లో ఉన్న వారు మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు.. ఆ మార్క్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రాతిపదికన తీసుకొని విద్యార్థుల పలితాలు ప్రకటించే ఆప్షన్ ని పరిశీలిస్తుంది బోర్డ్. మొదటి సంవత్సరం లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మినిమం పాస్ మార్క్స్ వేయాలని… ఒకవేళ ఇంటర్ బోర్డ్ ఆప్షన్స్ నచ్చక పోతే కరోన తీవ్రత తగ్గాక పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. పరిస్థితి ని బట్టి ప్రతిపాదనలు.. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వంకి పంపిస్తామని అంటున్నారు అధికారులు.

Exit mobile version