Site icon NTV Telugu

ప్రభుత్వానికి కరోనా మీద పైన అవగాహన లేనట్లు కనిపిస్తుంది…

ప్రజలలో గందరగోళం సృష్టించే పద్ధతులలో హెల్త్ అండ్ మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటన, మంత్రి ఈటల రాజేందర్ గారి ప్రకటన ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని శ్రీనివాస రావు ప్రకటన చేస్తే దానికి భిన్నంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గాలి ద్వారా కరోనా వ్యాపించదని చెప్పడమంటే ప్రభుత్వానికి కరోనా మీద పైన అవగాహన లేనట్లు కనిపిస్తుంది. ఇలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన టు అవుతుందని, ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం విధిస్తున్న కొన్ని నిబంధనల వల్ల పేద కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రైవేట్ టీచర్లకు ఇచ్చిన పరిహారం మాదిరిగానే కాలేజీ సిబ్బందికి, నిరుపేద కూలీలకు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసి మనదేశంలో కొరత రావడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు, కానికి దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల పెంపు  చేసి ఇతర దేశాల మెప్పు పొందడానికి ప్రయత్నాలు సాగిస్తోందని వారన్నారు. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టకుండా ఎన్నికల ప్రచారం హోరులో ప్రధాని మునిగిపోయారని వారు దుయ్యబట్టారు.

Exit mobile version