NTV Telugu Site icon

తెలకపల్లి రవి : ఎగ్జిట్‌పోల్స్‌లో మళ్లీ విజయన్‌, మమత-తమిళనాడులో స్టాలిన్‌,బిజెపికి అసోం మాత్రమే! 

పంచతంత్రంలో పారని మోడీ తంత్రం అని  ఎన్‌టివితొగులో చెప్పుకున్నదాన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు  ధృవపరుస్తున్నాయి.వారు పాలిస్తున్న అసోం మినహా తక్కిన మూడు ప్రధాన రాష్ట్రాలోనూ బిజెపి అధికారంలోకి రాకపోవచ్చని  ఎక్కువ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌చెబుతున్నాయి. హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలో బిజెపి  అధికారంలోకి రాకపోవచ్చని అత్యధిక పోల్స్‌ సూచిస్తున్నాయి. గతంలోని 211 స్థానాల నుంచి 150కి అటూ ఇటూగా తగ్గినా మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ మళ్లీ రావచ్చుననే చెబుతున్నాయి. రిపబ్లిక్‌ టీవీ పోల్స్‌లో బిజెపి  పెద్ద పార్టీగా వచ్చి హంగ్‌ ఏర్పడే సూచనలు కనిపిస్తుంటే ఇండియటుడే దానికి మరింత ఎక్కువ స్థానాలు ఇస్తున్నది. ఖచ్చితంగా ఏమి జరిగేది మే2వ తేదీ కోసం చూడవలసిందే. వామపక్షాలు కాంగ్రెస్‌ కూటమి అనుకున్నట్టు పుంజుకోలేదని కూడా ఈ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి.అయితే తృణమూల్‌ అధికారంలోకి రావడానికి  కాంగ్రెస్‌ మద్దతునిచ్చే అవకాశం కూడా ముందే  ఆ పార్టీ నేతలు ముందే వ్లెడిరచారు. ఇప్పుడూ చెబుతున్నారు. 

తమిళనాడులో స్టాలిన్‌ నాయకత్వంలోని డిఎంకె కూటమి అఖండ విజయం సాధించబోతున్నట్టు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. అధికారానికి అవసరమైన 118 కంటే చాలా ఎక్కువగా 150 వరకూ రావచ్చని అంచనా వేశాయి. ఒకోసారి ఒకరు గెలిచే వరవడిని గత ఎన్నికల్లోనే జయలిత ఛేదించారు. అయితే ఆమె మరణానంతరం ఫళనిస్వామి సర్కారు నిలబడటానికి  కేంద్రం నుంచి సహకరించిన బిజెపి ఎన్నికల పొత్తు కూడా పెట్టుకుంది. రజనీకాంత్‌నూ రప్పించాలని విశ్వప్రయత్నం చేసింది. అవన్నీ విఫలమై చివరకు ఓటమి తప్పనట్టే కనిపిస్తుంది.  కరుణానిధి వున్నంత కాలం తండ్రిచాటునే నాయకత్వం నెరిపిన స్టాలిన్‌ మొదటిసారి స్వయంగా నాయకత్వం వహించి రాష్ట్ర సారథ్యం చేపట్టడం కొత్త పరిణామం.

ఈ ఎన్నికలో మరో అపూర్వమైన ఫలితం కేరళలో కనిపిస్తున్నది. నభై ఏళ్లుగా అక్కడ ఎల్‌డిఎఫ్‌ యుడిఎప్‌ లు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నాయి.మొదటిసారి ఈ వరవడిని ఛేదించి పినరాయి విజయన్‌ నాయకత్వంలో ఎల్‌డిఎఫ్‌ రెండవసారి అధికారం నిబెట్టుకోవడం ఖాయంగా ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ వెల్లడించాయి. మెజార్టీ కూడా ఎక్కువగానే వుండేట్టు కనిపిస్తుంది,కరోనాను ఎదుర్కొవడంలో విజయన్‌ ప్రభుత్వ కృషి ప్రపంచ ప్రశంసలు పొందింది, సంక్షేమ పథకాల పైనా బాగానే శ్రద్ద పెట్టారు. శబరిమలై వంటి మతపరమైన సమస్యను తీసుకొచ్చినా తట్టుకుని నిలబడ్డారు, ఆఖరుకు ముఖ్యమంత్రి విజయన్‌పైనే అవినీతి ఆరోపణలు సృష్టించి కేంద్ర దర్యాప్తు సంస్థను రంగంలోకి దించి వెంటాడినా ప్రజలు కమ్యూనిస్టునే విశ్వసించడం పెద్ద విశేషం, బిజెపి మొదట్లో చేసిన హడావుడి చివరకు నిలవకుండా పోగా కాంగ్రెస్‌ మరింత బలహీనపడటం రాజకీయంగా కీలక పరిణామం. బెంగాల్‌ మరోసారి ఎదురుదెబ్బ తిన్న కమ్యూనిస్టులకు కేరళ పెద్ద వూరట ఉత్సాహం కూడా. దక్షిణ భారతంలో బిజెపి చొరబాటు తేలికకాదని ఈ రెండు రాష్ట్రా ఫలితాలు మరోసారినిరూపించాయి. పుదుచ్చేరిలో అనుకూలంగా వున్నట్టు చెబుతున్నా వివరాలు అందవలసి వుంది,.అసోంలోనూ కాంగ్రెస్‌ ఆశలు అడియాసలై బిజెపి మరోసారి అధికారం నిబెట్టుకుంటున్నట్టు ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి.126 స్థానాలున్న అసోం శాసనసభలో బిజెపి కూటమికి అత్యధిక  పోల్స్‌ ఆధిక్యత నివ్వగా కొన్ని మాత్రం హంగ్‌ వస్తుందని చెప్పాయి. అయితే అందులోనూ బిజెపి పెద్ద పార్టీగా వుంటున్నది. ఈ పరిస్తితిలో అస్సాం కూడా వారికి రావచ్చని పరిశీకు అంటున్నారు. 


సాగర్‌లో టిఆర్‌ఎస్‌ తిరుపతిలోవైసీపీ

ఇక  తిరుపతి లోక్‌సభ  ఉప ఎన్నికల్లో వైసీపీకి విజయంతో పాటు భారీ మెజార్టి కూడా వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ వ్లెడిస్తున్నాయి, ఒక పోల్‌ ప్రకారం మూడులక్షలకు పైగా మరో పోల్‌ ప్రకారం నాలుగు లక్షలు ఆధిక్యతవచ్చే అవకాశముంది. ఇక్కడ పుంజుకోవాని ఆశించిన తెలుగుదేశం వ్యూహం ఫలించకపోగా బిజెపి మరింతగా దెబ్బతిననుంది,దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత నేరుగా తిరుపతి గురించి వారు చేసిన హడావుడి ఆయాపై దాడుల ప్రకాచం అక్కరకు రాలేదు. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిపై టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 20 వేల ఓట్లతో గెవచ్చని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. ఇక్కడా బిజెపి నామకార్థంగానే మిగిలిపోయింది.

కోవిడ్‌19 సెకండ్‌ వేవ్‌ను అరికట్టడంలోనూ చికిత్స రాష్ట్రాలకు సహాయం తదితర విషయాలోనూ మోడీ ప్రభుత్వ వైఫల్యం పట్ల ఓటర్లపై ప్రతికూలతకు ప్రతిబింబంగానూ ఈ ఫలితాలను చూస్తున్నారు.పూర్తి ఫలితాలు వచ్చాక మరింత విశ్లేషణకు అవకాశం వుంటుంది