నిన్న జరిగిన సీఎం సభ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆటంకాలు సృష్టించారు.అయిన సభ బ్రహ్మాండం గా జరిగింది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాగే సాగర్ లో జానారెడ్డి గెలిచి ఏమి సాధిస్తారు అని ప్రశ్నించారు. టీఆరెస్ ప్రభుత్వం వచ్చి ఏమి చెయ్యలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. కానీ టీఆరెస్ పాలనలో రైతులు అంతా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు బండ బుతులు మాట్లాడుతున్నారు.జానారెడ్డి నీటి సూక్తులు మాట్లాడుతున్నారు. నిన్న సీఎం చెప్పినట్లు సాగర్ ముఖ చిత్రం మారబోతుంది. సాగర్ నియోజిక వర్గంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళాం..ఎన్నికల తరువాత వాటి పరిష్కరిస్తాము. నెల్లికల్లు లిఫ్టు 30 వేల ఎకరాలకోసం డిజైన్ చేశారు..ఎన్నికల తరువాత పనులు మొదలు అవుతాయి. సాగర్ లో ఏ గ్రామానికి రోడ్లు సరిగా లేవు. ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా,పెంక్షన్లు వస్తున్నాయి. జానారెడ్డి అధికారంలో వున్నపుడు 10 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము లక్ష 32 వేల ఉద్యోగుల ఇచ్చాము. మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాము. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ యువతకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీగా ఉత్తమ్ గెలిచాకా సాగర్ వైపు కన్నెత్తి చుడలేదు.. ఎన్నికలు ఉన్నాయని ఉత్తమ్ ఇప్పుడే సాగర్ కు వచ్చారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి ని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. జానారెడ్డి నిన్ను గెలిపిస్తే నీ దగ్గర ఏమి ఉందని అభివృద్ధి చేస్తావ్. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు లేవు. ద్వంసమైన కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. జానారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు యువకుడు, విద్యావంతుడు నోముల భగత్ గెలిస్తే రానున్న 3 సంవత్సరాల లో ఎవరు ఊహించని అభివృద్ధి జరుగుతుంది అని తెలిపారు.