NTV Telugu Site icon

ఏపీలో మత్స్యకారులకు కేంద్ర పథకాలు చేరడం లేదు…

పెదగంట్యాడ మండలం గంగవరంలో వెలసిన పెద అమ్మవారు ఆలయంలో కపిలేశ్వరానందగిరి స్వామీజీ నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో కన్వీనర్ సునీల్ థియోధర్. అక్కడ ఆయన మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వంలో అవినీతి కారణంగా మత్స్యకారులకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో చేరడం లేదన్నారు. నెల్లూరు ప్రాంతంలో డీఎంకే అండ ఉన్న తమిళనాడు ఫిషింగ్ మాఫియా మత్స్యకారుల వలలను నాశనం చేస్తోంది. ఇందులో వైసీపీ నాయకుల పాత్ర ఉంది అని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం కోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత మోడీకి దక్కింది. కోవిడ్ సమయంలో మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల్లో మత మార్పిడులు ఎక్కువయ్యాయి అన్నారు. ఇక గ్రామదేవతలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది అని పేర్కొన్నారు.