NTV Telugu Site icon

మిస్టర్ ఐపీఎల్​​ రైనాకు సాయం చేసిన సోను సూద్…

సినిమాలో విలన్ గా నటించే సోనూ సూద్ కరోనా సమయంలో తాను ఓ రియల్ హీరో అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం అడిగిన కాదనకుండా చేస్తూ వస్తున్నాడు. అయితే సోనూ సూద్ తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్​ సురేశ్​ రైనాకు సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్​ సిలిండర్​ను పంపి తనలోని మానవత్వాన్ని చూపారు. ‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాలి. ఆమె వయసు 65. తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో ఉన్నారు’ అని రైనా ట్వీట్‌ చేశాడు. దానికి స్పందించిన సోనూ సూద్‌..’10 నిమిషాల్లోనే ఆక్సిజన్‌ సిలిండర్‌ అక్కడికి చేరుకుంటుంది భాయ్‌’ అంటూ రిప్లై ఇచ్చారు.