Site icon NTV Telugu

కర్ఫ్యూ కారణంగా తండ్రి అంతిమ చూపుకు నోచుకోని కొడుకు…

శ్రీకాకుళం, ఆమదాలవలస (మం) బొబ్బిలిపేటలో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. కర్ఫ్యూ కారణంగా తండ్రి అంతిమ చూపుకు నోచుకోలేదు ఓ కొడుకు. కరోనాతో ఆవాల అప్పయ్య (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. అయితే ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు మృతుడి కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కానీ కర్ఫ్యూ కారణంగా ఊరికి రాలేకపోతున్నామంటూ బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పయ్య మృతదేహాన్ని ముట్టుకునేందుకు స్థానికులు సాహసించలేదు. దాంతో రెడ్ క్రాస్ సొసైటీకి సమాచారం అందించారు సచివాలయ సిబ్బంది. సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ సిబ్బంది అప్పయ్యకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

Exit mobile version