వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది. చంద్రబాబు, ఆయన అనుచరగణం.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ను అదనంగా కొనుగోలు చేయటం లేదని ఆరోపిస్తున్నారు. దీని వల్ల ప్రజలు ఆందోళనతో వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున పోగయి వైరస్ వ్యాపించటానికి కారణం అవుతున్నారు. మేము కంపెనీలకు వ్యాక్సిన్ కోసం లేఖలు రాశాం… కేటాయింపులు పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉందని చెబుతున్నా…తిరిగి అవే ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ కేంద్రం తన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. రాష్ట్ర జనాభాను బట్టి మేమే వ్యాక్సిన్ కేటాయింపులు చేస్తున్నాం అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది అని తెలిపారు.