పూణెలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 50 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 64 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో సాహా 21 పరుగులు, మిల్లర్ 11, రాహుల్ తెవాటియా 11 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు సాధించాడు. అర్షదీప్ సింగ్, రిషి ధావన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పంజాబ్ 144 పరుగులు చేయాలి. టోర్నీలో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు గెలుపు కీలకంగా మారింది.
Cricket: వెస్టిండీస్ కొత్త కెప్టెన్‌గా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు